రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అంబెడ్కర్ జయంతి వేడుకలు
భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ 130 జయంతి సందర్భంగా పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి బిసి సంఘాల మరియు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో
స్థానిక ఎబియం స్కూల్ వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి బిజెపి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి
పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
సిఐటియు ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
దళిత బహుజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు అంబెడ్కర్ సేవా లను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ, తెలుగు దేశం పార్టీ నాయకులు, సిపిఎం,సిపిఐ జనసేన, కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహా యాదవ్, స్థానిక నాయకులు బాలగాని నాగరాజు పెమ్మని అల్లూరి సీతారామరాజు చిట్టిబోయిన విజయ్ కుమార్ యాదవ్, బిసి నాయకులు మచ్చా వెంకట రమణ తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి వెంకట నారాయణ బాబు, మీగడ ఓబుల్ రెడ్డి, షేక్ రసూల్, ముల్లా ఖూద్దుస్, భూమ సుబ్బయ్య, సయ్యద్ ఇమాంసా, అనిల్, జ్యోతి మల్లిఖార్జునరావు, నరసింహారావు, ఎండీ గౌస్, ముని శ్రీనివాస్ ఠాగుర్ నరసింహారావు, కె లక్ష్మి నారాయణ, బిజెపి నాయకులు మాకినేని అమర్ సింహా, చంద్రశేఖర్, రవికుమార్, వెంకట్, స్టూడియో బాబు, సామి బాల శ్రీను, కాంగ్రెసు పార్టీ నాయకులు షేక్ సైదా, జనసేన పార్టీ నాయకులు పెరుసాముల శ్రీనివాస్, వైకాపా నాయకులు రోటీ యస్ధాన్, షేక్ జిలానీ, దళిత బహుజన హక్కుల పోరాట సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు