నగర పంచాయితీ కార్మికుల అర్దనగ్న నిరసన
పొదిలి నగర పంచాయితీ కార్మికులకు ఐదు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ పొదిలి నగర పంచాయితీ కార్మికుల అర్దనగ్న నిరసన చేపట్టారు.
వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయితీ కార్యాలయం వద్ద శుక్రవారం నాడు ఐదు నెలల జీతాలు ,ఇతర సమస్యలపై ఎపి మున్సిపల్ వర్కర్స్&ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) ఆద్వర్యంలో అర్దనగ్నంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి యం రమేష్ మాట్లాడుతూ పొదిలి గ్రామ పంచాయితీని నగర పంచాయితగా మార్చిన ప్రభుత్వం పూర్తి అదికారాలు బదలాయించకపోవడంతో 5 నెలలుగా కార్మికులకు జీతాలు లేక అర్దాకలితో జీవించాల్సివస్థుందన్నారు.నగర పంచాయితీ సాదారాణ కార్యక్రమాలకు జీతాలకు ఆటంకం లేకుండా అవసరమైన అనుమతులు తెప్పించుకోవడంలో జిల్లా అదికారులు ,కమీషనర్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్థుందన్నారు.