తెలంగాణ రాష్ట్రం చెందిన మద్యం భారీగా పట్టివేత ఒక ద్విచక్ర వాహనం పదివేల నగదు స్వాధీనం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం భారీగా పట్టివేత మరియు ఒక ద్విచక్ర వాహనం , పదివేల ఏడు వందల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక పొదిలి యస్ఇబి స్టేషన్ స్టేషన్ నందు మంగళవారం నాడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు కొనకనమీట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో నాగం సుబ్బయ్య అను వ్యక్తి నుంచి ,811 క్వార్టర్లు మద్యం తోపాటు ఒక ద్విచక్ర వాహనం మరియు 10700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు నిందితుడు అక్కడినుంచి పరారైనట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పొదిలి యస్ఇబి స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.