ప్రభుత్వ వైద్యశాలకు 20 మంచాలు పంపిణీ చేసిన మాగుంట
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు సొంత నిధులతో పంపించిన 20 మంచాలను స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ వైద్యశాల ప్రధాన వైద్యులు చక్రవర్తికి అందజేశారు.
ప్రస్తుత రెండో విడత కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మంచాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా పొదిలి ప్రభుత్వ వైద్యశాల కు 20 మంచాలను గురువారం నాడు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చక్రవర్తి , డాక్టర్ వడ్డే నరేంద్ర, డాక్టర్ రఫీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, కల్లం వెంకట సుబ్బారెడ్డి, జి శ్రీనివాస్, గొలమారి చెన్నారెడ్డి, కొత్తపులి బ్రహ్మ రెడ్డి,షేక్ గౌస్ మొహియుద్దీన్, షేక్ గౌస్, మాధవరెడ్డి, గూడురి వినోద్ తదితరులు పాల్గొన్నారు