పొగాకు బోర్డును సందర్శించిన శాసనసభ్యులు కుందూరు
పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి సందర్శించారు.
గత రెండు రోజులుగా పొగాకు వేలం కేంద్రంలో రైతులకు గిట్టుబాటు ధర లభించక వేలం నిలిచిపోయిన విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి శుక్రవారం నాడు స్థానిక పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు.
రైతులకు అండగా నిలవాల్సాన అధికారులు వ్యాపారులకు కొమ్మకాస్తు మద్దతు ధరకల్పించడంలేదని ఆయనముందు రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.
అనంతరం ఎమ్మెల్యే పోగాకుబొర్డు అధికారులతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జి శ్రీనివాస్, గొలమారి చెన్నారెడ్డి, కల్లం వెంకట సుబ్బారెడ్డి మరియు రైతులు , రైతు సంఘం నాయకులు తదితరులు
పాల్గొన్నారు