బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి మృతికి సంతాపం తెలిపిన విశ్వబ్రాహ్మణ సంఘం
శ్రీ బ్రహ్మం గారి మఠం ఏడో తరం పీఠాధిపతి శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి మృతికి పొదిలి విశ్వ బ్రాహ్మణ సంఘం సంతాపం ప్రకటించింది.
వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక చిన్న బస్టాండ్ సామంతపూడి టింబర్ డిపో నందు శ్రీ శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు సామంతపూడి నాగేశ్వరరావు ,గుంటూరు బ్రహ్మం, పేరుసోముల శ్రీనివాస్, నిమ్మల సూర్యం, కళ్యాణ్ ,చంద్ర ,చుండూరు బ్రహ్మం ,వీరనారాయణ ,కోటయ్య, ప్రసాద్ ,శేఖర్ ,బాల బ్రహ్మం ,బాబు రాంబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు