పొగాకు బోర్డు అధికారులు కంపెనీలతో కుమ్మక్కు అయ్యారని బిజెపి ఆరోపణ
పొగాకు బోర్డు అధికారులు కంపెనీలతో కుమ్మక్కు అయ్యారని భారతీయ జనతాపార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని భారతీయ జనతాపార్టీ నాయకులు సందర్శించి రైతులతో మాట్లాడారు.
పొగాకు బోర్డు అధికారులు కంపెనీలతో కుమ్మక్కు అయ్యా గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారని తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.
పొగాకు బోర్డు చైర్మన్ తో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు మాకినేని అమర్ సింహా, పార్లమెంట్ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్, భారతీయ జనతా యువ మోర్చా మండల అధ్యక్షులు దాసరి మల్లి , దళిత మోర్చా నాయకులు వెంకట్ పట్టణ నాయకులు ఆకుపాటి లక్ష్మణ్ స్థానిక బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు