ఫ్రెండ్స్ ఫరెవర్ టీం ఆధ్వర్యంలో అంత్యక్రియలు
కరోనా సోకిందంటే చాలు అయినవాళ్లే దగ్గరికి రాని పరిస్థితులు నెలకొన్నాయి ఆఖరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కొన్ని కుటుంబాలు ముందుకు రావట్లేదు దీంతో అందరూ ఉండి కూడా దిక్కు లేని అనాథ శవాలుగా మారుతున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా విస్పోటనానికి మానవత్వం కూడా మంట కలిసిపోతున్న వేళ… కొన్ని స్వచ్చంద సంస్థలు మాత్రం తాము ఉన్నామంటూ భరోసా ఇస్తున్నాయి.
ఏ సంబంధం లేకపోయినా కేవలం మానవతా దృక్పథంతో కరోనా పేషెంట్ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి
అందులో భాగంగా పొదిలి పట్టణంలో స్థానిక సాయిబాబా గుడి వీధి లో నివసిస్తున్న చెన్నయ్య (75) వ్యక్తి మృతి చెందటంతో అంత్యక్రియలకు బంధువులు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఫ్రెండ్స్ ఫరెవర్ సభ్యులకు సమాచారం తెలపటంతో వారు ముందుకు వచ్చి వారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఫ్రెండ్స్ ఫరెవర్ టీం సభ్యులకు పలువురు అభినందించారు.