మరోమారు ఫ్రెండ్స్ ఫరెవర్ టీం ఆధ్వర్యంలో అంత్యక్రియలు
రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించిన ఫ్రెండ్స్ ఫరెవర్ టీం సోమవారం నాడు ఒక మహిళ కు అంత్యక్రియలు నిర్వహించాగా నేడు మరో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
వివరాల్లోకి కొనకనమీట్ల మండలం మునగపాడు గ్రామంలో బత్తుల వెంకయ్య (70) మంగళవారం నాడు మృతి చెందటంతో అంత్యక్రియలకు బంధువులు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఫ్రెండ్స్ ఫరెవర్ సభ్యులకు సమాచారం తెలపటంతో వారు ముందుకు వచ్చి వారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఫ్రెండ్స్ ఫరెవర్ టీం సభ్యులు ఇప్పటికీ మూడు అంత్యక్రియలు నిర్వహించారు.