చెట్టును ఢీకొన్న ఆటో ఒకరి మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు
పొదిలి మండలం కుంచేపల్లి గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరి మృతి మరో ముగ్గురు కి తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం నాడు చోటుచేసుకుంది.
దర్శి నుంచి పొదిలి కి వస్తున్నా ఆటో కుంచేపల్లి సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు విషయం తెలుసుకున్న స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా గాయపడినవారిని హుటాహుటిన పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం దర్శి మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఆదినారాయణ (56) మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించగా మార్గంమధ్యలో మృతి చెందారు.
ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా చెందిన రహంతుల్లా, గిద్దలూరు చెందిన ఖాసిం వలి ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించగా తాళ్లూరు మండలం చెందిన యలమందరెడ్డి వైద్యశాల నందు చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.