ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ ఆంక్షలు ప్రెవేటు ట్రావెల్స్ వర్తించావా !
వేల రూపాయల్లో టికెట్ ధరలు ఉన్న పట్టించుకొని అధికారులు
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణం మీదుగా గత వారం రోజులుగా హైదరాబాద్ కు ప్రెవేటు ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నా
సంబంధించిన అధికారులు పట్టించుకోవటం యదేచ్ఛగా ప్రెవేటు ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ ఆంక్షలు తమకు వర్తించవు అనే విధంగా ప్రెవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహారిస్తు వేల రూపాయల్లో టికెట్ల అమ్మకాలు జరుపుతు బస్సులో పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్ళుతున్న విషయం తెలిసిందే.
ఇప్పడికైన అధికారులు స్పందించి అక్రమంగా ప్రజా రవాణా సాగిస్తున్న ప్రెవేటు ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.