కర్ఫ్యూ సమయంలో రోడ్డేక్కిన వాహనాలకు అపరాధ రుసుం వేసిన పోలీసులు

పొదిలి పట్టణంలో కర్ఫ్యూ సమయంలో రోడ్డేక్కిన వాహనాలకు పొదిలి పోలీసులు అపరాధ రుసుం వేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఆదివారం కర్ఫ్యూ సమయం సాయంత్రం 6 గంటల తర్వాత పెద్ద బస్టాండ్ వద్ద పొదిలి సిఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో వాహనాలను నిలిపివేసి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూ సమయం తర్వాత నిబంధనలు ఉల్లంఘించి రోడ్ మీదకు రావడం సరైంది కాదని నిబంధనలు మన మంచి కోసమేనని అర్ధం చేసుకోవాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.