అట్టహాసంగా గృహ నిర్మాణ శంకుస్థాపనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పేదలందరికి ఇండ్లు పథకంలో భాగంగా గృహ నిర్మాణ శంకుస్థాపనలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
వివరాల్లోకి వెళితే గురువారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని జగనన్న లే ఔట్ నందు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ యొక్క ప్లాట్లు వద్ద వారివారి సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా ప్రత్యేక కలెక్టర్ వసంతకుమార్, లే ఔట్ ను సందర్శించి శంకుస్థాపనలు ప్రక్రియను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక అధికారులకు శంకుస్థాపనలు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ ,గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ పవన్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు మరియు గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.