భూమి పూజ లో పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్

నవరత్నాలు లో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని హౌసింగ్ జాయింట్ కలెక్టర్ జెసి విశ్వనాథన్ పర్యవేక్షించారు.

 

వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక జగనన్న కాలనీ నందు రెండో రోజు భూమి పూజ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ పర్యవేక్షించారు.

 

పొదిలి మండలం లో మొత్తం 1612 గృహాలు మంజూరు చేయగా మూడు విడతల్లో భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని లబ్ధిదారులు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి భూమి పూజ చేయడం అభినందనీయమని అన్నారు. అర్హులైన లబ్ధిదారులు లబ్ధిదారుల జాబితాలో లేని వారు దరఖాస్తు చేసుకోవాలని వారికి 90 రోజులలో ఇంటి నివేశన స్థలము మంజూరు చేస్తామని ఎవరు నిరాశ చెందవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ హనుమంతరావు స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ రావు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ కృష్ణ వివిధ శాఖల అధికారులు సచివాలయల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు