జూలై 10న జాతీయ లోక్ అదాలత్

దేశవ్యాప్తంగా జూలై 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు శనివారం నాడు న్యాయమూర్తి భార్గవి అధ్యక్షతన తో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్ష సమావేశంలో న్యాయమూర్తి భార్గవి మాట్లాడుతూ రాజీపడి తగిన‌ అన్ని క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు ,వివాహ సంబంధ కేసులు ,చెక్ బౌన్స్ కేసులు ,మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, ఇరువర్గాల ఆమోదంతో పరిష్కరించబడ్డతయని ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకొని న్యాయస్థానాల్లో చెల్లించిన ఫీజును వాపస్ పొందవచ్చని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల , మర్రిపుడి, యస్ఐలు వెంకటేశ్వర నాయక్ ,సుబ్బరాజు పొదిలి ఎస్ఐ కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు