పొదిలి నగర పంచాయితీ లో ఎంఎల్ఏ కుందూరు విస్తృత పర్యటన
గనన్న లే ఔట్ లో పలువురి భూమి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
పట్టాలు మంజూరు కానివారికి త్వరలో పట్టాలు మంజూరు హామీ
మాదాల వారి పాలెం లో వార్డు సచివాలయం భవనం ప్రారంభం
పొదిలి నగర పంచాయితీ పరిధిలో ఆదివారం నాడు మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి విస్తృతంగా పర్యటించారు.
తొలుత పొదిలి పట్టణంలోని జగనన్న లే ఔట్ ను సందర్శించి భూమి పూజ శంకుస్థాపనలు ప్రక్రియను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
అనంతరం పలువురి శంకుస్థాపన కార్యక్రమాల్లో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్ని సాంప్రదాయ బద్దంగా కొబ్బరి కాయలు కొట్టి లాంఛనంగా భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అర్హత కల్గి పట్టాలు మంజూరు కానివారికి పట్టాలు మంజూరు చేయించాలని శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి దృష్టికి తీసుకొని రాగా అర్హత కల్గి పట్టాలు మంజూరు కానివారికి త్వరలో పట్టాలు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తహశీల్దారు హనుమంతరావు ను కోరారు.
అనంతరం మాదాల వారి పాలెం లోని వార్డు సచివాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్, ఎపిఓ బుల్లయ్య , వైకాపా నాయకులు జి శ్రీనివాసులు,కల్లం వెంకట సుబ్బారెడ్డి,గొలమారి చెన్నారెడ్డి, కొత్తపులి బ్రహ్మ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు