భూమి పూజ అడ్డగింత పై ఎంఎల్ఏ కు ఫిర్యాదు సదరు వ్యక్తి చర్యలు తీసుకోవాలని డిమాండ్

పొదిలి నగర పంచాయతీ కాటూరి వారి పాలెం 3 ,4 వార్డు లో చెందిన నిరుపేద కుటుంబాలకు పొదిలి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 760/11 నందు 61 ప్లాట్ తో లే ఔట్ వేసి 48 మందికి పట్టాలు పంపిణీ చేశారు.

సదరు లే ఔట్ నందు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వెళ్ళితే స్థానికంగా ఉండే వైకాపా నాయకుడు కాటూరి మురళి అడ్డుకుంటూ ఈ భూమి మాది అని కోర్టు లో వేస్తామని కావున భూమి పూజ చేస్తే సహించేది లేదని హెచ్చరించారని మహిళా ఆవేదన వ్యక్తం చేశారు.

తమతో పాటు సచివాలయం టెక్నికల్ అసిస్టెంట్ ను జియో ట్యాగింగ్ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఆదివారం నాడు పొదిలి పట్టణంలోని జగన్ అన్న ను సందర్శించిన శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లగా అక్కడే ఉన్నా తాసిల్దారు తో మాట్లాడి ఈ విషయం తెలుసుకున్నారు తక్షణమే వారికి భూమి పూజ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.