ఘనంగా వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు
కాపునాడు వ్యవస్థాపకులు మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన రంగా 74 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పొదిలి పట్టణంలోని స్థానిక చిన్న బస్టాండ్ సెంటర్ నందు వంగవీటి మోహన రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో లో పొదిలి మండలంలోని వంగవీటి మోహన్ రంగా అభిమానులు కాపునాడు నాయకులు వివిధ పార్టీల కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాపునాడు నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు, ముని శ్రీనివాస్, బెల్లంకొండ శ్రీనివాస్, విజయలక్ష్మి, నాబార్డు ప్రాజెక్టు డైరెక్టర్ కొంకాల రామ్మోహన్, ఆకుపాటి లక్ష్మణ్ వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు