గంటల్లో నగదు అపహరణ కేసును ఛేదించిన పొదిలి సీఐ సుధాకర్

అపహరణకు గురైందని ఫిర్యాదుపై పొదిలి సిఐ సుధాకర్ రావు రెండు గంటల్లో కేసులోని మిస్టరీని ఛేదించారు.

పొదిలి పట్టణంలోని రథం రోడ్డు నందు ఏడు లక్షల రూపాయల నగదు అపహరణకు గురైందని ఫిర్యాదుపై పొదిలి సిఐ సుధాకర్ రావు రెండు గంటల్లో కేసులోని మిస్టరీని ఛేదించారు.

పొదిలి పోలీస్ స్టేషన్ నందు బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పొదిలి సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఏడు లక్షల రూపాయలు నగదు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి కారు నందు పరారైనట్లు ఫిర్యాదు రాగా

ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ లో భాగంగా సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలించగా బ్యాగులు మార్చుకొని కారు దిగిన దృశ్యాలు పరిశీలించిన మీదట ఫిర్యాదుదారులను విచారణ చేయటంతో అసలు విషయాన్ని ఒప్పుకొని తప్పు జరిగింది తామ 7 లక్షలకు 70 లక్షలు ఇచ్చారని కావాలంటే డబ్బులు చెక్ చేసుకోవాలని పదిహేను వందల రూపాయలు నగదు ఇచ్చి

సిడిఎమ్ మిషన్ వేయగా అవి మంచివే అని ధ్రువీకరించుకొని చేతులు చేతులు మార్చుకొని ఊరి చివర కి పోయి చూడగా సదరు నందు తెల్లని కాగితాలు పెట్టి ఉండటం గమనించ గమనించడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులకు అసలు విషయం చెప్తే ఈ విషయం బయట పడుతుందని తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పొదిలి సిఐ సుధాకర్ రావు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు వారిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని తెలిపారు తెలిపారు

ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, కానిస్టేబులు శివ, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు