రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన శాసనసభ్యులు

పొదిలి నగర పంచాయితీ 15 వార్డు మాదాలవారిపాలెం నందు నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు.

రైతు దినోత్సవం సందర్భంగా పొదిలి మండలం పరిధిలోని కాటూరి వారి పాలెం లోని పాదిలి6 , యేలురు, పొదిలి -2 , పాములపాడు రైతు భరోసా కేంద్రాలను శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.