రైతు భరోసా చైతన్య యాత్రలు ప్రారంభం
పొదిలి మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వైయస్సార్ రైతు భరోసా చైతన్య యాత్రలను శనివారం నాడు యేలూరు , ఉప్పలపాడు గ్రామాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గ్రామ సభల్లో పొదిలి మండలం వ్యవసాయ అధికారి దేవి రెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ ఖరీఫ్ 2021 పంటకాలంలో మార్కెట్ ఆధారిత వరి వంగడాల సాగుపై మరియు మెట్ట భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మెట్ట భూముల్లో బోర్ల కింద వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వలన భూగర్భ జలాలను ఆదా చేయటమే కాక ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని తక్కువ విద్యుత్ తక్కువ నీటితో వారికి బదులు అపరాలు మొక్కజొన్న చిరుధాన్యాలు కూరగాయలు సాగు చేసుకోవచ్చని తెలియజేశారు.
ఈ యాత్రలో పశువర్ధక శాఖ డాక్టర్ మని శేఖర్ గ్రామ సర్పంచులు, రైతులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.