విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి: వ్యవసాయ అధికారి దేవిరెడ్డి
విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండాలని పొదిలి మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు అన్నారు.
వివరాల్లోకి వెళితే సోమవారం నాడు మండలములోని తలమర్ల ఆముదాలపల్లి గ్రామాలలో వైయస్సార్ రైతు భరోసా చైతన్య యాత్రలో భాగంగా జరిగిన సమావేశంలో వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రస్తుతం రైతు శ్రేయస్సు కొరకు వివిధ పంట రకాల విత్తనాలు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం ద్వారా వ్యవసాయ శాఖ సరఫరా చేస్తుందని విత్తనాలను రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలు చేయవచ్చని తెలిపారు.
రైతులకు ఒకే పంట కాకుండా అందులో అంతర పంటగా కానీ వేసుకున్నట్లయితే వాటి ద్వారా అధిక లాభం పొందవచ్చని తెలిపారు.
పశుసంవర్ధక శాఖ సహాయకురాలు మాట్లాడుతూ గొర్రెలకు వ్యాక్సిన్ చేయించుకోవాలని తెలిపారు అలాగే గేదెలు చనిపోయినట్లు అయితే వాటికి ట్యాగ్ వేసి ఉంటే దానికి బీమా వస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆముదాలపల్లి గ్రామ సర్పంచ్ సిరిమల్లె శ్రీనివాస్ యాదవ్ , తలమల్ల గ్రామ సర్పంచ్ వెంకట సుబ్బమ్మ,గ్రామ వ్యవసాయ సహాయకురాలు డి అమృత బి నర్మద మరియు పశుసంవర్ధక శాఖ సహాయకురాలు,లక్ష్మీ , నస్రీన్ రైతులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.