ప్రజలతో గౌరవం పదంగా వ్యవహరించాలి దరిశి డియస్పీ నారాయణస్వామి రెడ్డి
ప్రజలతో గౌరవం పదంగా వ్యవహరించాలని దరిశి డియస్పీ నారాయణస్వామి రెడ్డి అన్నారు.
వివరాల్లోకి వెళితే బుధవారం నాడు స్థానిక పొదిలి పట్టణం దరిశి రోడ్ లోని మంజునాథ కళ్యాణ మంటపం నందు మర్రిపుడి యస్ఐ సుబ్బారాజు అధ్యక్షతనతో జరిగిన పొదిలి ,టి పి పల్లి యస్ఐలు సురేష్, వెంకటేశ్వర్లుల వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా హాజరైన దరిశి డియస్పీ నారాయణస్వామి రెడ్డి మాట్లాడుతూ పోలీసులు అంటే ప్రజల్లో గౌరవం కలిగే విధంగా ప్రవర్తించాలని అదే విధంగా నేర పరిశోధనలో నిత్యం నేర్చుకోవాలని సూచించారు.
పొదిలి సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ పెండింగ్ కేసులు లేకుండా పని పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోని ప్రజా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పని చెయ్యాలని అన్నారు.
అనంతరం యస్ఐలు సురేష్, వెంకటేశ్వర్లు లను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి యస్ఐ శ్రీహరి, కొనకనమీట్ల యస్ఐ శివ, తాడివారిపల్లి యస్ఐ సువర్ణ, దొనకొండ యస్ఐ ఫణి భూషణ్ తదితరులు పాల్గొన్నారు