16 నుంచి నగర పంచాయితీ కార్మికుల సమ్మె
పొదిలి నగరపంచాయితీలో పారిశుద్ధ్య కార్మికులకు గత 6నెలల నుండి చెల్లంచాల్సిన జీతాలు ,పెండింగ్ సమస్యలపై ఈనెల 16నుండి విదులు బహిష్కరించి సమ్మెలోకీ వెళ్ళనున్నట్లు ఎపి మున్సిపల్ వర్కర్స్&ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పొదిలి నగర పంచాయితీ అధ్యక్షకార్యదర్శులు జి నాగులు ,డి సుబ్బయ్యలు తెలిపారు.
మున్సిపల్ కార్మికుల జీతాలు పెండింగ్ సమస్యలపై బుదవారం నాడు స్థానిక పొదిలి నగరపంచాయితీ కార్యాలయం వద్ద ధర్నా చేసారు.
ఈ ధర్నాలో కార్మికులు మాట్లాడుతూ ఈనెల 12 నాటికి జీతాలు చెల్లిస్థామన్న నగరకమీషనర్ నేటికి ఇవ్వలేదన్నారు.
సకాలంలో జీతాలు ఇచ్చి ఆర్దికబాధలనుండి ఆదుకోవాలని పదే పదే నగర కమీషనర్ దృష్టికి తీసుకెళ్ళిన ప్రతిసారి ఇస్థామని వాయిదా వేస్తూ కార్మికుల సహనానికిపరీక్ష పెడుతున్నట్లుందన్నారు.
కరోనా క్లిష్టకాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించిన కార్మికుల కుటుంబాలకు సకాలంలో జీతాలిఛ్చి ఆదుకోవాల్సిన భాధ్యత అదికారులపై ఉందన్నారు.
భార్యాబడ్డలు పస్థులతో ఉంటున్నా ఎండనకా ,వాననకా డ్యూటిచేస్థున్న కార్మికుల సమస్యల పట్ల అధికారులతోపాటు ప్రభుత్వ నిర్లక్ష్యం కోట్టోచ్చినట్లు తేటతెల్లభవుతుందన్నారు.
అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చుకొని సాదారణావసరాలు తీర్చుకోవాల్సి వస్థుందన్నారు.చిల్లర సరుకులు అప్పులిచ్చిన వారు కార్మికులను అత్యంత అవమానంగా మాట్లాడటంతో మానసికక్షోభకు గురవుతున్నారన్నారు.
గత 3 సంవత్సరాలుగా యూనిఫాం ఇవ్వలేదన్నారు.ఫి.యఫ్.సమస్య ధీర్ఘకాలంగా పెండింగ్లో ఉందన్నాని డ్యూటిలో ఉండి కరోనాతో మరణించిన బండి ఇస్రాయెల్ కి ప్రభుత్వ ఆర్దికసహకారం అందేలా తగినచర్యలు తీసుకోవటంలో అదికారుల నిర్లక్ష్యంవల్ల నేటికి పరిహారం అందలేదన్నారు.
పెరిగిన నగర పంచాయితీ విస్తీర్ణానికనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు.పై సమస్యలు పరిష్కరించాలనిఈనెల 16 నుండి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్త్ళున్నామని నగర పంచాయితీలో అపరిశుభ్రతతో కరోనా ,సీజనల్ వ్యాదులు ప్రబలితే అందుకు అధికారులే బాధ్యత వహించాల్సివస్థుందన్నారు.
ఈ ధర్నాలో యూనియన్ నారకులు కెవి నరసింహం ,బి కోటేశ్వరావు జి ఏసోబు ,ఎ రాజయ్యలు తదితరులు పాల్గొన్నారు.