నకిలీ నోట్ల మోసం కేసులో ఇద్దరి అరెస్టు 4 లక్షల నగదు కారు స్వాధీనం

నకిలీ నోట్లు మోసం కేసులో ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 లక్షల రూపాయలు నగదు కారును స్వాధీనం చేసుకున్నట్లు దరిశి డియస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు.

స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ నందు శుక్రవారం నాడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దరిశి మండలం తూర్పు వీరయపాలెం గ్రామ చెందిన మధుమంచి అంజయ్య,మధుమంచి ప్రసాద్, అమరా బ్రహ్మయ్య, మధుమంచి రత్తయ్య, అనంతపురం చెందిన పూజారి గోపాల్ ముద్దాయిలు పైన కర్నాటక రాష్ట్రం బెంగళూరు చెందిన మహమ్మద్ రహంతుల్లా ఖాన్ ఫిర్యాదితో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జూలై 7వ తేదీన మధుమంచి అంజయ్య, పూజారి గోపాల్ లు ఫిర్యాది మహమ్మద్ రహంతుల్లా ఖాన్ ను ఒక లక్ష రూపాయలకు 10 లక్షల దొంగనోట్లు ఇస్తామని నమ్మించి పొదిలి- దరిశి రోడ్ శివాలయం వద్దకు రప్పించి వారి వద్ద నుంచి 7 లక్షల రూపాయలు నగదు తీసుకొని వారికి స్టీల్ పెట్టేలో 50 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పి వాటి స్థానంలో న్యూస్ పేపర్స్ పెట్టి పైన ఆరు 500 రూపాయల మంచి నోట్లు పెట్టి మోసం చేసిన కేసులో శుక్రవారం నాడు స్థానిక ఉన్నగురవాయపాలెం వద్ద కేసులోని 3వ ,4వ ముద్దాలైన అమరా బ్రహ్మయ్య, మధుమంచి రత్తయ్య లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 లక్షల నగదును నేరంకు ఉపాయోగించిన ap 39HR 7119 నెంబరు గల తెల్లని హుండాయ్ కారును స్వాధీనం చేసుకున్నామని మీగత ముద్దాయిలను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.

కేసును త్వరితగతిన పూర్తి చేసి ముద్దాయిలు అరెస్టు లో ప్రతిభా చూపినా సిఐ సుధాకర్ రావు, యస్ఐ శ్రీహరి లను ఐడి పార్టీ పోలీసులను డియస్పీ నారాయణస్వామిరెడ్డి అభినందించారు.

ఈ సమావేశంలో పొదిలి సిఐ సుధాకర్ రావు యస్ఐ శ్రీహరి,ఎయస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్, కానిస్టేబులు శివ, వీర్రాజు, రవిశంకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు