మూడో రోజుకు చేరిన కార్మికుల సమ్మె సమ్మెకు మద్దతు ప్రకటించిన బిజెపి

పొదిలి నగర పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులు తమకు రావాల్సిన ఆరు నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ తలపెట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది.

నగర పంచాయితీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించిన భారతీయ జనతాపార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు సిరసనగుండ్ల శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు.

అనంతరం ఆయన మీడియాతో పారిశుద్ధ్య కార్మికులు చేసే సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు ఉంటుందని తక్షణమే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ మండల పార్టీ అధ్యక్షులు మాకినేని అమర్ సింహా మండల నాయకులు మగులూరి రామయ్యా, సురే శ్రీనివాస్ , వెంకట్ , బాల శ్రీను మరియు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు