పొల్లా, యర్రంరెడ్డి లను ఘనంగా సత్కరించిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు
తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్, కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డిలు ఎంపికైన సందర్భంగా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా సత్కరించారు.
స్థానిక టైమ్స్ మీడియా కార్యాలయంలో గురువారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొల్లా నరసింహా యాదవ్, యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి లను పూలమాలలు,శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పొల్లా నరసింహా యాదవ్ మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ కి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.
యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తానని కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు.
తమకు పదవులు రావటానికి కారణమైన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీకి నియోజకవర్గ ఇన్చార్ కందుల నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొనకనమీట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కనకం నరసింహారావు, తెలుగు దేశం పార్టీ నాయకులు మూరబోయిన బాబురావు యాదవ్, సన్నెబోయిన సుబ్బారావు, తెలుగు యువత నాయకులు కనకం వెంకట్రావు యాదవ్ , మువ్వ కాటంరాజు యాదవ్ , పెమ్మని అల్లూరి సీతారామరాజు, రెడ్డి బోయిన సుబ్బారావు, చిట్టిబోయిన విజయ్ కుమార్ యాదవ్ ,మోహన్ తదితరులు పాల్గొన్నారు