పొదిలి లో తృటిలో తప్పిన పెను ప్రమాదం
ప్రకాశంజిల్లా పొదిలి గుద్దేటివారి వీదినందు పెనుప్రమాదం తప్పింది.
గుద్దేటివారి విధిలోని ఒక ఇంట్లో గ్యాస్ లీక్ అయి చుట్టుప్రక్కల వారిని భయబ్రాంతులకు గురిచేసింది. గ్యాస్ లీకై సిలిండర్ చుట్టు మంటలు అంటుకొగా ఇరగుపొరుగు దానిపై ఇసుక పొసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసారు. కాని మంటలు ఆగకపొగా ఇంకా ఎక్కువుతుండటంతో స్దానిక పెట్రోల్ బంక్ లో వుండే అగ్నినిరొదక మిషన్ సహయంతొ మంటలర్పారు. విషయం తెలుసుకున్న పొలీసులు,ఇండియన్ గ్యాస్ ఎజన్సి నిర్వాహకులు అక్కడిచేరుకొని విషయాలు తెలుసుకున్నారు.
గ్యాస్ లీకై మంటలు రావడంతో చుట్టుప్రక్కల ఇండ్ల వారు ఒక్కసారిగా భయానికి గురై ఇండ్లకు తలుపులు వేసి దూరంగా వెళ్ళారు.
మంటలు అదుపులోకి వచ్చాయన్న తరువాత ఒక్కసారిగా ఊపిరి పిల్చుకున్నారు.