క్విట్ ఇండియా డే సందర్భంగా రైతుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
క్విట్ ఇండియా డే సందర్భంగా రైతు కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద సోమవారం నాడు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్విట్ ఇండియా డే ను సేవ్ ఇండియా సేవ్ అగ్రికల్చర్ దినంగా పాటించాలని అదే విధంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసేందుకు తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దేశం లో ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతు కార్మిక ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు