ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు దరిశి డియస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు.
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డియస్పీ నారాయణస్వామి రెడ్డి మాట్లాడుతూ పొదిలి పట్టణం చెందిన గాదంశెట్టి నవీన్ యొక్క ఎపి27ఎహెచ్ 2687 నెంబర్ గల ద్విచక్ర వాహనం పెద్ద బస్టాండ్ వద్ద పార్క్ చేసి ఉండగా కొనకనమీట్ల మండలం అంబపురం గ్రామం చెందిన మోడీ వెంకట స్వామి ఆగస్టు 4వ తేదీ మారు తాళం తో దొంగలించుకొని వెళ్ళాడు సదరు ముద్దాయి పొదిలి పట్టణంలోని మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద అరెస్టు చేసి విచారణ చేసి అతని వద్ద నుంచి దొంగలించిన ద్విచక్ర వాహనం తోపాటు మరో మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ముద్దాయి పై దరిశి పోలీసు స్టేషన్ నందు పలు దొంగతనాల కేసులు నమోదు కాబడి ఉన్నాయి అన్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పొదిలి సిఐ సుధాకర్ రావు, యస్ఐ శ్రీహరి లను పోలీసు సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకర్ రావు యస్ఐ శ్రీహరి హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ కానిస్టేబుల్ వీరభద్రం పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు