సచివాలయాలను సందర్శించిన తహశీల్దారు రఫీ

పొదిలి నగర పంచాయతీ పరిధిలోని మాదాల వారి పాలెం వార్డు సచివాలయాన్ని మరియు కొండాయపాలెం గ్రామ సచివాలయాన్ని పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ గురువారం నాడు సందర్శించారు.

సచివాలయం పరిధిలో రికార్డులను తనిఖీ చేసి ఇ కె వై సి గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్ట్ ప్రకారం పని చెయ్యాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంట గ్రామ రెవెన్యూ అధికారులు సుబ్బారావు, చిన్న వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు