కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం

పొదిలి కరొనా వైరస్ నియంత్రణలోను మరియు అరికట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పొదిలి మండల కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ, మండల న్యాయ సేవాధికార సంస్థ, ప్రజా రవాణా శాఖ మరియు స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పొదిలి పట్టణంలోని బస్ స్టేషన్ లో ప్రయాణికులకు, ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు, మరియు ఆటో డ్రైవర్లకు, ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచుగా చేతులు శుభ్రపరచడం పై అవగాహన కలిగించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ బి సి సి జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనుటకు అందరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మన వ్యక్తిగత జాగ్రత్తలే మనకు రక్షణ అని తెలియజేశారు.

డిపో అసిస్టెంట్ మేనేజర్ రమణ మాట్లాడుతూ మాస్క్ లేనిదే డిపో ఆవరణంలోనికి ప్రవేశం లేదని, మాస్కులు లేకుండా బస్సులో ప్రయాణించడానికి అనుమతి లేదని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ బి సి సి జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ కుమార్,ఎ.ఎస్.ఐ కె. శ్రీనివాసరావు, ఏపీఎస్ఆర్టీసీ పొదిలి డిపో అసిస్టెంట్ మేనేజర్ రవణమ్మ ,పారా లీగల్ వాలంటీర్లు బొనిగెల లక్ష్మి, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, నాలుగవ సచివాలయం కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీసభ్యులు తదితరులు పాల్గొన్నారు.