ఘనంగా 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పొదిలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు తహశీల్దారు రఫీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు జడ్జి యస్ భార్గవి, ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఎంపిడిఓ శ్రీకృష్ణ, పొదిలి పోలీసు స్టేషన్ నందు యస్ఐ శ్రీహరి ,
నగర పంచాయితీ కార్యాలయం నందు కమీషనర్ భవాని ప్రసాద్, వ్యవసాయ శాఖ కార్యాలయం నందు దేవి రెడ్డి శ్రీనివాసులు, ప్రభుత్వం వైద్యశాల నందు డాక్టర్ చక్రవర్తి, రోడ్లు మరియు భవనాలు శాఖ డిఈ కార్యాలయం నందు డిఇ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నందు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పిన్నిక గిరిజా కుమారి ,రక్షిత మంచినీటి సరఫరా (ప్రాజెక్టు) కార్యాలయం నందు డిఈ భావనారాయణ , వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు చైర్మన్ జి కోటేశ్వరి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలుల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సాధించుకొన్నమని అన్నారు.