ఆదిలక్ష్మి వరించిన మరో జాతీయ పురస్కారం

భారత్ మాత ఫౌండేషన్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి జాతీయ పురస్కారాలు -2021 అందజేశారు.

పొదిలి పట్టణం చెందిన న్యాయసేవాధికార సంస్థ మండల లీగల్ వాలంటీర్ గా విశేష సేవలందించిన ఆదిలక్ష్మి ఒంగోలు సిసిఎస్ సిఐ బి శ్రీనివాసులు చేతుల మీదుగా భారత మాత ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమదేవి, వర్థమాన నటి టినా చౌదరి మరియు సంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు