దళిత విద్యార్థిని హత్యకు బాధ్యత వహించి హోం మంత్రి రాజీనామా చెయ్యాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ లోకేష్ అరెస్టు పట్ల తెలుగు దేశం నాయకులు ఖండన
గుంటూరు లో దళిత విద్యార్థిని హత్యకు బాధ్యత వహించి హోం మంత్రి రాజీనామా చెయ్యాలని తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్ తెలుగు యువత నాయకులు కనకం వెంకట్రావు యాదవ్ డిమాండ్ చేశారు.
తెలుగు దేశం పార్టీ జాతీయం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టు పట్ల తీవ్రంగా ఖండించారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజునే గుంటూరులో హత్యకు గురైన దళిత విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించటానికి వెళితే అరెస్టు చెయ్యటం దారుణమని అన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశత్వం గా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వారు తీవ్రంగా మండిపడ్డారు
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశ చట్టం పేరుతో చప్పట్లు కొట్టి తప్ప ఆచరణలో కఠిన చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు.
తక్షణమే రాష్ట్రప్రభుత్వం బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు