లోకేష్ అరెస్టు పట్ల తెలుగు దేశం నాయకులు ఖండన
గుంటూరు లో హత్యకి గురి అయినా దళిత మహిళ రమ్య ని పరామర్శించటానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ని ఈ ప్రభుత్వ తప్పుడు విధానం తో అరెస్ట్ చేయటాన్ని పొదిలి మండల తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. పొదిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రమ్య హత్య కి సంబంధించి నైతిక భాద్యత వహిస్తు రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి సుచరిత గారు వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసారు.
ఇప్పటికి అయినా ఈ తప్పుడు విధానాలు మానుకోవాలని దుర్మార్గపు అరెస్ట్ లు చెయ్యటం తప్పు అని ఖండించారు. ఇప్పటికి అయినా రాష్ట్ర ప్రజలు ఆలోచించు కోవాలని అని సంక్షేమం అని వైసీపీ పార్టీ మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది అని గతంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఆడవాళ్ళ మీద అరాచకాలు జరిగేవి ప్రశ్నించిన వాళ్ళని అప్పట్లో జైలు కి హింసించటం చేసే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్ర దినోత్సవం సాక్షిగా మళ్ళీ బ్రిటిష్ పరిపాలన ఘట్టాలు చూస్తున్నాము అని హితబు పలికారు.
ప్రజలు ఇప్పటికి అయినా మార్పు రావాలని ఫ్రీడమ్ ఫైట్ చెయ్యాలని ఈ దుర్మాగా పాలనలో మన ఆడబిడ్డలకు మనమే రక్షణ కల్పించుకోవాలి అని ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్, పొదిలి మండల అధ్యక్షులు మీగడ ఓబులురెడ్డి, పట్టణ అధ్యక్షులు ముళ్ల ఖుద్దూస్, జిల్లా నాయకులు పొల్లా నరసింహం, యలమంద, వెంకటేశ్వరరెడ్డి, వై. నాగేశ్వరరావు, శ్యామంతపూడి నాగేశ్వరరావు, డాక్టర్ ఇమాంసా, కాటూరి శ్రీను, వెంకట్, ముని శ్రీను, షేక్ మౌలాలి, సురేష్, షబ్బీర్, నజీర్, బుజ్జి, కాలేషా, పొదిలి ఐ టీడీపీ కో ఆర్డినేటర్ ఏటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.