కరోనా మూడో దశ పట్ల ప్రజలను అప్రమత్తం చెయ్యాలి వైద్య అధికారిణి షహీదా

పొదిలి మండలం పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉప్పలపాడు మెడికల్ ఆఫీసర్ షహీదా అధ్యక్షతన కరోనా మూడవ దశ మరియు నియంత్రణ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా ఏఎన్ఎంలు ఆశాలు కు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఉప్పలపాడు మెడికల్ ఆఫీసర్ షహీదా మాట్లాడుతూ కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి యొక్క ప్రైమరీ మరియు సెకండరీ కాంటాక్ట్లను వేగంగా సేకరించి పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని. జలుబు జ్వరం దగ్గు వంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా వచ్చి పరీక్షలు చెప్పించుకునే విధంగా అవగాహన కల్పించాలని విదేశాల నుండి వచ్చిన వారు ఖచ్చితంగా కరోనా పరీక్షలు జరిపించేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప్పలపాడు వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు