మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
పొదిలి పట్టణం రాజుపాలెం గ్రామం బీసీ కాలనీ నందు 17 సంవత్సరాల మైనర్ బాలిక కు బాల్య వివాహం జరుగుతుందని 1098 కి రాబడిన సమాచారం మేరకు సిడబ్ల్యూసి ఆదేశాల మేరకు1098 చైల్డ్ లైన్ ప్రతినిధి ప్రసాద్ , ఐసిడిఎస్ సూపర్వైజర్ కమల కుమారి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి మండల న్యాయ సేవా సహాయకురాలు ఆదిలక్ష్మి అంగన్వాడీ టీచర్లు కలిసి బాల్య వివాహమును నిలిపివేయటం జరిగింది.
బాల్య వివాహం చేయడం వల్ల కలిగే కష్టనష్టాల గురించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని 18 సంవత్సరాలు నిండిన తర్వాత బాలికలకు వివాహం చేయాలని సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి తెలిపారు
అనంతరం వారి తల్లిదండ్రుల నుండి 18 నిండిన తర్వాత మాత్రమే వివాహం చేస్తామని అంగీకార పత్రం తీసుకోవడం జరిగింది