ప్రమాద రహిత దినం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు

ప్రకాశం జిల్లా యస్పీ మలికా గర్గ్ ఆదేశాల మేరకు ప్రతి శనివారన్ని ప్రమాద రహిత దినం ప్రకటించిటంతో పొదిలి సిఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

పొలీసు , రోడ్లు మరియు భవనాలు శాఖ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శాఖల సంయుక్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో పర్యటించి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాలసిన జాగ్రత్తలు మరియు నివారణ కై సూచనలు సలహాలను వాహనదారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రోడ్డు పై హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్నా వారికి పొదిలి సిఐ సుధాకర్ రావు గులాబీ పువ్వులను అందజేశారు.

పట్టణంలోని దరిశి రోడ్డు నందు మార్జిన్ కు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించారు అదే విధంగా కంభాలపాడు గ్రామ సమీపంలో నామ పలకలను ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకర్ రావు,యస్ఐ శ్రీహరి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు