పొల్లా , యర్రంరెడ్డిలను సత్కరించిన నూకసాని బాలాజీ
తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్, కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి లను పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ శాలువా కప్పి సత్కరించారు.
వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు స్థానిక ఒంగోలు తెలుగు దేశం పార్టీ కార్యాలయం నందు పార్లమెంట్ కమిటీ తొలి కార్యవర్గ సమావేశంలో కార్యవర్గంలో ఉన్న అందరినీ నూకసాని బాలాజీ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ పార్లమెంట్ కమిటీ ఉన్న ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు.