ఎంఎల్ఏ కుందూరు ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరణ

మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు తహశీల్దారు ‌రఫీ అధ్యక్షతన తో జరిగిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 40 దరఖాస్తులు రాగా అందులో 2 దరఖాస్తులను అక్కడే పరిష్కారం చూపుగా 38 దరఖాస్తులను విచారణ జరిపి పరిష్కారిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్, సర్వేయర్ బ్రహ్మం, మండలం పరిధిలోని గ్రామ రెవెన్యూ అధికారులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.