ప్రియురాలు ఫిర్యాదు తో ఆగిన పెళ్లి
తానను ప్రేమించి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు అంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దింతో వివాహం నిలిచింది.
ప్రకాశం జిల్లా దర్శి మండలం చౌటపాలెంకు చెందిన రవీంద్రబాబు పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు అంతేకాదు మరికొద్ది సేపట్లో వివాహం జరుగుతుంది అనగా పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాహని అడ్డుకున్నారు.
దర్శి మండలం చౌటపాలెంకుచెందిన ఓ యువతిని గతంలో ప్రేమించి, వివాహం చేసుకుంటానని నమ్మించి మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు, విషయం తెలుసుకున్న ప్రియురాలు దర్శి పోలీసులను ఆశ్రయించింది.
రవీంద్ర బాబు ప్రియురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పొదిలి విశ్వనాధపురం ఆంజనేయస్వామి గుడిలో జరుగుతున్న వివాహన్ని అడ్డుకున్నారు. మరికొద్ది సేపట్లో యువతి మెడలో తాళి కట్టాల్సిన రవీంద్ర బాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని దరిశి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.