పెద్దరికట్ల హత్యకేసు ముద్దాయి అరెస్టు

కొనకనమీట్ల మండలం పెద్దరికట్ల గ్రామంలో హత్యా కేసులోని ముద్దాయిని అరెస్టు చేసినట్లు దరిశి డియస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు.

వివరాల్లోకి వెళితే గురువారం నాడు స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దరిశి డియస్పీ నారాయణస్వామి రెడ్డి మాట్లాడుతూ మృతుడు కొత్త వెంకటేశ్వరరావు పెళ్ళాని సాకలేనోడా అనే వ్యాఖ్యలు మనస్సులో పెట్టుకున్నా ముద్దాయి కొత్త పుల్లారావు నిన్ను బుధవారం నాడు స్థానిక పెద్దారికట్ల గ్రామంలో మద్యం సేవించే సమయంలో వరుసకు బాబాయి అయిన కొత్త వెంకటేశ్వరరావు తాను కూడా మద్యం సేవించడం కోసం అక్కడికి రావటంతో ఒక్కసారిగా క్వార్టర్ బాటిల్ పగల కొట్టి గొంతు లో పొడిచి అతనిని హత్య చేసారని తర్వాత నిందుతుడు చర్యలతో గ్రామస్తులు భయపడ్డారని అన్నారు.

మృతుడు భార్య ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని తెలిపారు. ముద్దాయి కొత్త పుల్లారావును నిన్ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో పొదిలి సిఐ సుధాకర్ రావు, యస్ఐ శివ తదితరులు పాల్గొన్నారు