గ్రామ వాలంటీర్లు ఎంపికకు నోటిఫికేషన్ విడుదల: ఎంపిడిఓ శ్రీకృష్ణ

పొదిలి మండల మరియు పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.

పొదిలి సచివాలయం 1 నందు 2 ఒక్కటి బిసి, ఒక్కటి ఓపెన్, పొదిలి సచివాలయం 4 నందు ఒక్కటి బిసి పొదిలి సచివాలయం 5 నందు ఓపెన్ జనరల్ 1 పొదిలి సచివాలయం 6 నందు 1 ఓపెన్ జనరల్ ,యేలూరు 1ఓపెన్ జనరల్ , ఉప్పలపాడు 1 బిసి జనరల్ , మూగచింతల 1 యస్సీ జనరల్ మొత్తం 8 ఖాళీలు గాను ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 2 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.