10 మంది పేకాట రాయుళ్లు అరెస్టు

పొదిలి పట్టణం టైలర్స్ కాలనీ నందు రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా పదిమంది పేకాటరాయుళ్ల అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8490 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పొదిలి ఎస్ఐ శ్రీహరి శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబులు‌ పూర్ణచంద్రరావు, ప్రవీణ్ కుమార్, కానిస్టేబుల్ కాశయ్య , అమీర్ వలి, మోహన్ తదితరులు పాల్గొన్నారు