తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ పొదిలి మండల తెలుగు దేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాడు స్థానిక పెద్ద బస్టాండ్ నందు రాస్తారోకో నిర్వహించి అక్కడి నుంచి నేరుగా మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ ధర్నా చేపట్టారు.

 

అనంతరం పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ కీ వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు తెలుగు దేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ నిత్యావసరాలు,పెట్రోల్,డీజిల్, ధరలు తారాస్థాయికి చేరాయని దానితో సామాన్య ప్రజలు పై తీవ్ర ప్రభావం చూపుతుందని రోజుకు వేల కోట్లు అప్పులు చేసి పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే మొదటగా ఆఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.

 

తక్షణమే నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం తగ్గించాలని మరియు మౌళిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ప్రజల ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ పార్లమెంటు కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్, కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ రసూల్, జిల్లా మాజీ కార్యదర్శి ఆవులూరి యలమంద,సమంతపూడి నాగేశ్వరరావు,  మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్ ,  పొదిలి మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్,, టి యన్ యస్ యస్ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్, మండల పట్టణ నాయకులు ఎండీ గౌస్, జ్యోతి మల్లి నరసింహారావు,ముని శ్రీనివాస్, తెలుగు యువత నాయకులు కాటూరి శ్రీను,యేటి ఏడుకొండలు, తెలుగు మహిళ నాయకురాలు షేక్ షాన్వాజ్ తదితరులు పాల్గొన్నారు