తోపు భూమిని పరిశీలించిన వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్
పొదిలి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 1177 లోని వ్యవసాయ శాఖ చెందిన భూమి ఆక్రమణకు గురైందనే ఫిర్యాదు పై శనివారం నాడు ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె అన్నపూర్ణ తోపు పోరంబోకు భూమిని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమణ గురైందని ఫిర్యాదు మేరకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో భూమిని పరిశీలించామని సంబంధించిన దస్త్రాలను పరిశీలించి నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ సర్వేయర్ బ్రహ్మం ,వ్యవసాయ శాఖ చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు