కాటూరికి ఘనంగా నివాళులు
మాజీ మంత్రి కాటూరి నారాయణ స్వామి 11వ వర్ధంతి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆదివారం నాడు స్థానిక చిన్న బస్టాండ్ లోని కాటూరి నారాయణ స్వామి విగ్రహాన్ని కి తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కాటూరి వారు పాలెం లోని కాటూరి నారాయణ స్వామి విగ్రహాన్ని కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాటూరి నారాయణ స్వామి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సమితి అధ్యక్షులుగా , శాసనసభ్యులుగా మంత్రి గా, పనిచేసారు 1984లో నరసరావుపేట లోక్సభ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పై ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించరని అదే విధంగా తెలుగు దేశం ఆవిర్భావ సమయంలో ప్రకాశం గుంటూరు జిల్లాలకు అధ్యక్షులు గా వ్యవహరించి 1983 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో కాటూరి నారాయణ స్వామి కుమారులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు, మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, పార్లమెంట్ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ రసూల్, జిల్లా తెలుగు దేశం పార్టీ మాజీ కార్యదర్శి ఆవులురి యలమంద, మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్, మాజీ ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా, తెలుగు దేశం పార్టీ మండల నాయకులు సన్నేబోయిన సుబ్బారావు, తెలుగు మహిళ నాయకురాలు షేక్ షన్వాజ్, తెలుగు యువత నాయకులు కాటూరి శ్రీను జ్యోతి మల్లి, సీనియర్ సిటిజన్ మాకినేని రమణయ్య తదితరులు పాల్గొన్నారు