చౌడేశ్వరి దేవి దేవస్థానం లో దొంగతనం

ఈసారైనా ఠాణా అధికారి కేసు నమోదు చెయ్యాలని పూజారి డిమాండ్

కొనకనమీట్ల మండలం మునగపాడు గ్రామంలోని చౌడేశ్వరి దేవి దేవస్థానం నందు దొంగతనం సంఘటన వెలుగుచూసింది.

పూజారి రాజయ్య ఉదయం గుడి తలుపులు తెరిచేందుకు రాగా గుడిలో హుండీ పగులకొట్టి ఉండగా మరో మూడు హుండీ కనిపించకపోవడంతో చుట్టూ ప్రక్కల పొలాల్లో వెదికి చూడగా అక్కడ గుడిలో దొంగిలించిన హుండీలు పొలాల్లో కనిపించాయి సదరు దొంగతనం జరిగిన విషయాన్ని స్ధానిక గ్రామస్తులకు తెలియజేసి పోలీసులకు సమాచారం అందించారు.

గ్రామస్తులు సమాచారంతో సంఘటన స్థలానికి కొనకనమీట్ల యస్ఐ శివ చేరుకొని దొంగతనం జరిగిన తీరు పరిశీలించి వెళ్ళారు.

దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పొదిలి టైమ్స్ బృందం దేవస్థానం చేరుకొని దొంగతనం సంఘటన వివరాలు తెలుసుకొని దేవస్థానం పూజారి రాజయ్య తో మాట్లాడగా ప్రస్తుతం హుండీలో సుమారు 10 వేలు రూపాయలు లోపు ఉండవచ్చని గత సంవత్సరం కాలంలో నాలుగు సార్లు దొంగతనం జరిగిన ఒక్కసారి కూడా కేసు నమోదు చెయ్యలేదని ఇప్పుడైనా ఠాణా అధికారి కేసు నమోదు చెయ్యాలని మొరపెట్టుకున్నారు.