మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ 50 లక్షలు ఇవ్వాలి

తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య డిమాండ్ మార్కాపురం మండలం రాజుపాలెం గ్రామంలో ఆదివారం ప్రభుత్వ స్కూల్ అంచు కూలి మృతి చెందిన విద్యార్థి పత్తి విష్ణు కుమార్ (వయస్సు 10 ) తల్లిదండ్రులకు ఎక్స్ గ్రేషియా క్రింద రూ 50 లక్షలను చెల్లించాలని తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు రవితేజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

స్థానిక పొదిలి చింతచెట్టు వద్ద   ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యాలయం నందు సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేకర్లల సమావేశంలో పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు రవితేజ మాట్లాడుతూ మృతుడు విద్యార్థి విష్ణు కుటుంబానికి వారం రోజుల లోపు 50 లక్షల నష్ట పరిహారాన్ని అందించాలని లేకపోతే విద్యాశాఖ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు చేశారు. ఒకవైపు పేదరికంతోను మరోవైపు కుమారున్ని పోగొట్టుకొని దుఃఖ సాగరంలో వున్న అ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన భాద్యత పాలక పక్షం మీద ఉందని గుర్తు చేశారు.
అలాగే శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలను,ముఖ్యంగా అటువంటి పాఠశాలను కూల్చివేసి నూతన భవన నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేరుకు నాడు -నేడు తప్ప ఆచరణలో ఎక్కడ అమలు జరగడం లేదని అన్నారు.

ఈ సమావేశంలో తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా, విద్యార్థి నాయకులు గోగినేని రాజేష్, బత్తిన రాకేష్ మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ రసూల్, పొదిలి మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి ,పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్, పట్టణ నాయకులు జ్యోతి మల్లి తదితరులు పాల్గొన్నారు